హిందీలో సూర్య తాజా సినిమా రీమేక్!

19-11-2020 Thu 16:12
  • హీరో సూర్య తాజా చిత్రం 'ఆకాశం నీ హద్దురా' 
  • సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన సినిమా
  • అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా విడుదల 
  • హిందీ రీమేక్ కి ఆసక్తి చూపుతున్న షాహిద్ 
Surya latest film to be remade in Hindi

తమిళ కథానాయకుడు సూర్య ఎంచుకునే కథలు వైవిధ్యంతో కూడి ఉంటాయి. అందుకే, ఆయా చిత్రాలలో కొత్తదనం కనిపిస్తుంది. తాజాగా ఆయన 'ఆకాశం నీ హద్దురా' పేరిట ఓ చిత్రాన్ని చేశాడు. తెలుగమ్మాయి సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా విడుదల చేశారు. చిత్రం సరికొత్త కథాంశంతో సాగడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి.

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ ఆత్మకథ 'సింప్లీ ఫ్లయ్' ఆధారంగా దీనిని తెరకెక్కించారు. ఈ చిత్రం హీరో సూర్యకు, దర్శకురాలు సుధ కొంగరకు కూడా మంచి పేరుతెచ్చిపెట్టింది. ఈ క్రమంలో అప్పుడే ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 'జెర్సీ' హిందీ రిమేక్ లో నటిస్తున్న షాహిద్ కపూర్ కి ఈ చిత్రం బాగా నచ్చడంతో హిందీ రీమేక్ లో చేయడానికి ఆసక్తిగా వున్నాడట. ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ దీనిని రీమేక్ చేసే ప్రయత్నాలలో వుంది.