ప్రియురాలితో భర్తకు పెళ్లి జరిపించిన భార్యామణి

Wife helps husband to marry his lover
  • మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న జంట
  • ఒక యువతిని భర్త ప్రేమించినట్టు గుర్తించిన భార్య
  • భర్తకు విడాకులిచ్చి, ప్రియురాలితో పెళ్లి జరిపించిన భార్య
సాధారణంగా సినిమాలలో చోటు చేసుకునే కథ... నిజ జీవితంలో జరిగింది. భర్తకు ఆయన ప్రియురాలితో పెళ్లి జరిపించిందో భార్యామణి. ఈ ఆసక్తికర ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే భోపాల్ లోని ఓ జంటకు మూడేళ్ల క్రితం పెళ్లైంది. అయితే తన భర్త గతంలో ఒక యువతిని ప్రేమించినట్టు ఆమె తెలుసుకుంది. పెళ్లైనా ఆమెను తన భర్త మర్చిపోలేకపోతున్నాడని గుర్తించింది.

అయితే, ఏదో ఒక రోజు ఆమెను కూడా పెళ్లి చేసుకుంటానని... ముగ్గురం కలిసి ఆనందంగా బతుకుదామని భార్యకు ఆయన చెప్పాడు. అయితే ముగ్గరం కలిసి బతికేందుకు చట్టం ఒప్పుకోదని ఆమె తెలిపింది. దీంతో ఆమె మూడేళ్ల వైవాహిక జీవితాన్ని వదులుకోవడానికి సిద్ధమైంది. తన భర్తకు విడాకులు ఇచ్చింది. భర్తకు ఆయన ప్రియరాలితో వివాహం జరిపించింది. ఈ విడాకుల కేసు గురించి లాయర్ మాట్లాడుతూ... ఆమె చాలా ఉన్నతంగా ఆలోచించి, మంచి నిర్ణయం తీసుకుందని చెప్పారు. భార్య చేసిన పనిని పలువురు మెచ్చుకుంటున్నారు.
Go Back to Shorts
Husband
Wife
Lover
Marriage

More Telugu News