కలకలం రేపుతోన్న హీరోయిన్ పూజ హెగ్డే వ్యాఖ్యలు.. వీడియో వైరల్

puja hedge video goes viral
  • దక్షిణాది వాళ్లకు హీరోయిన్ల నడుమంటే పిచ్చి
  • హీరోయిన్లను మిడ్ డ్రెసుల్లోనే చూడాలనుకుంటారు
  • వ్యాఖ్యలు చేసి పకపకా నవ్విన పూజ
దక్షిణాది అగ్ర హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోన్న పూజ హెగ్డే తాజాగా సౌతిండియా ప్రేక్షకులపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అన్నం పెట్టిన దక్షిణాది సినిమా వారిపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తావా? అంటూ విరుచుకుపడుతున్నారు.

దక్షిణాది ప్రేక్షకులకు హీరోయిన్ల నడుమంటే పిచ్చి అని ఆమె కామెంట్ చేసింది. హీరోయిన్లను వారు ఎల్లప్పుడూ మిడ్ డ్రెసుల్లోనే చూడాలనుకుంటారని తెలుపుతూ పకపకా నవ్వింది. మంచి పేరు ఇచ్చిన దక్షిణాది సినిమాపై ఇలా విమర్శలు చేయొద్దని నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక దక్షిణాదిలో ఆమెకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

పూజ హెగ్డే నడుమును తెలుగు సినిమాల్లో అధికంగా చూపుతున్నందుకే ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోందని, అల్లు అర్జున్ ‘డీజే’, వరుణ్ తేజ్ ‘గడ్డలకొండ గణేశ్’ వంటి సినిమాల్లో ఇటువంటి సీన్లు ఉన్నాయని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ‘అల వైకుంఠపురం’ సినిమాలో 'నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నాకళ్లు..' పాటను , ఆ సినిమాలో ఆమె వేషధారణను గుర్తు చేస్తూ కొందరు కామెంట్లు చేశారు.

కాగా, గతంలో దర్శకుడు రాఘవేంద్రరావుపైనా, ఆయన సినిమా పాటల్లో హీరోయిన్ల నడుముపై పూలు, పండ్లు విసరడంపైనా హీరోయిన్ తాప్సీ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
Pooja Hegde
Viral Videos
Tollywood

More Telugu News