తెలంగాణలో కొత్తగా 1,607 మందికి కరోనా నిర్ధారణ
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 1,607 మందికి కరోనా నిర్ధారణ

1607 new cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,48,891
  • మొత్తం 2,27,583 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1372
  • జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 296 కరోనా కేసులు  
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,607 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 937 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,48,891 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,27,583 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1372కి చేరింది. ప్రస్తుతం 19,936 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 17,134 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 296 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 115 కేసులు నిర్ధారణ అయ్యాయి.
    
Corona Virus
COVID19
Telangana

More Telugu News