Koppula Eshwar: లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన తెలంగాణ మంత్రి... అరగంట పాటు టెన్షన్!

  • మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తప్పిన ప్రమాదం
  • మధ్యలోనే నిలిచిపోయిన లిఫ్టు
  • తీవ్రంగా శ్రమించి మంత్రిని బయటికి తీసుకొచ్చిన సిబ్బంది
Telangana minister Koppula Eshwar stranded in a lift

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఇవాళ ఓ లిఫ్టులో ఇరుక్కుపోయారు. దీంతో అరగంట పాటు అందరిలోనూ తీవ్ర ఉద్విగ్నత ఏర్పడింది. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ సైఫాబాద్ లోని సామ్రాట్ అపార్ట్ మెంట్స్ లో బుడగ జంగాలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం లిఫ్టులో కిందికి వస్తుండగా అది సాంకేతిక కారణాలతో మధ్యలోనే నిలిచిపోయింది.

తిరిగి రీస్టార్ట్ చేసినా పైకి, కిందికీ తిరిగిందే తప్ప ఆ లిఫ్టు గ్రిల్స్ తెరుచుకోలేదు. మంత్రి లిఫ్టులో చిక్కుకుపోవడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. దాదాపు అరగంట సేపు తీవ్రంగా శ్రమించిన అనంతరం ఆయనను సిబ్బంది సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. ఎట్టకేలకు లాక్ తెరుచుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఆ లిఫ్టు చాలా పాతది కావడం, మంత్రిపాటు అనేకమంది ఎక్కడంతో ఓవర్ లోడ్ కారణంగా నిలిచిపోయినట్టు భావిస్తున్నారు.

More Telugu News