తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!
Add ap7am to your home Screen

తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

1504 new  cases in telangana
  • గత 24 గంటల్లో కొత్తగా 1,504 కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,35,656
  • మొత్తం 2,16,353 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య 1,324  
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,504 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,436 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,35,656 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,16,353 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,324 కి చేరింది. ప్రస్తుతం 17,979 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 14,938 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 288 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 115 కేసులు నిర్ధారణ అయ్యాయి.
       
Corona Virus
COVID19
Telangana

More Telugu News