Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

  • గత 24 గంటల్లో కొత్తగా 1,481 కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,34,152
  • 2,14,917 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,319  
Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,481 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,451 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,34,152 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,14,917 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,319 కి చేరింది. ప్రస్తుతం 17,916 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 14,883 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 279 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 111 కేసులు నిర్ధారణ అయ్యాయి.

   

More Telugu News