Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

  • గత 24 గంటల్లో కొత్తగా 837 కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,32,671
  • మొత్తం 2,13,466 మంది డిశ్చార్జ్  
spike of 837 new cases in telangana

తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 837 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,554 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,32,671 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,13,466 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,315 కి చేరింది. ప్రస్తుతం 17,890 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 14,851 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 185 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 59 కేసులు నిర్ధారణ అయ్యాయి.  
      

More Telugu News