వేరే దేశ అబ్బాయిని ప్రేమించిందని.. ఫ్రాన్స్‌లో అమ్మాయికి గుండు గీయించిన కుటుంబ సభ్యులు

25-10-2020 Sun 14:33
  • తీవ్రంగా పరిగణించిన ఫ్రాన్స్ ప్రభుత్వం
  • నిందితులకు దేశ బహిష్కరణ విధించిన ఫ్రాన్స్
  • ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థ వద్ద అమ్మాయి
family beats girl in france

ఫ్రాన్స్‌లో ఓ అమ్మాయికి సొంత కుటుంబ సభ్యులు గుండుగీయించి అవమానించారు. వేరే దేశానికి చెందిన యువకుడిని ప్రేమించడమే ఆమె చేసిన పాపం. బోస్నియాకు చెందిన ఆ కుటుంబం రెండేళ్లుగా ఫ్రాన్స్‌లోని బెసాన్‌కాన్‌లో ఉంటోంది.

ఆ కుటుంబంలోని  ఓ అమ్మాయి (17) తమ అపార్టుమెంటోని వేరే ఇంట్లో ఉంటోన్న సెర్బియాకు చెందిన 20 ఏళ్ల యువకుడిని ప్రేమిస్తోంది. మతాలు వేరైనా వారిద్దరి మనసులు కలిశాయి. అయితే, వారి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసిపోయింది. దీంతో ఆమెను వారు శారీరకంగా హింసి, గుండు గీశారు.

చివరకు ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంది. ఓ మీడియా దృష్టికి ఈ ఘటన రావడంతో ఈ ఘటనను ప్రసారం చేసింది. అక్కడి ప్రభుత్వం ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయి తల్లిదండ్రులతో పాటు ఆ కుటుంబానికి చెందిన మరో ముగ్గురు  బంధువులు ఆమెను హించిసించినట్లు తేల్చింది.

దీంతో వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. బెసాన్‌కాన్‌ నగరం నుంచి బోస్నియా రాజధాని సరజెవోకు పంపింది. ఆ అమ్మాయి బాధ్యతలను ప్రస్తుతం  సామాజిక సేవా సంస్థ చూసుకుంటోంది. ఆమె మేజర్‌ అయినతర్వాత ఫ్రాన్స్‌లోనే నివసించే హక్కును పొందుతుంది.