ప్రభాస్ 'రాధే శ్యామ్' విడుదలపై అప్ డేట్!
- వాస్తవానికి 'రాధే శ్యామ్' ఈ టైంలో విడుదలవ్వాలి
- లాక్ డౌన్ వల్ల షూటింగుకి అంతరాయం
- గత కొన్ని రోజులుగా ఇటలీలో షూటింగ్
- జనవరి 1న కానీ, జనవరి 14న కానీ విడుదల
దీంతో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు ప్రస్తుతం రెండు తేదీలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 1న కానీ, సంక్రాంతి సందర్భంగా జనవరి 14న కానీ విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ రెండింటిలోనూ ఒక తేదీని త్వరలోనే ఫైనల్ చేస్తారని అంటున్నారు.
పిరీడ్ డ్రామాగా ఇటలీ నేపథ్యంగా ఈ చిత్ర కథ సాగుతుంది. దీంతో గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగును ఇటలీలోని పలు లొకేషన్లలో నిర్వహిస్తున్నారు. ముఖ్య సన్నివేశాలతో పాటు హీరో హీరోయిన్లు ప్రభాస్, పూజ హెగ్డే జంటపై కొన్ని పాటలను కూడా అక్కడ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.