Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్!

  • గత 24 గంటల్లో కొత్తగా 1,554 కేసులు 
  • కోలుకున్న వారు 1,435 మంది
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,19,224
  • 1,94,653 మంది డిశ్చార్జ్  
sipke of  1554 cases in telangana

తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,554 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,435 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,19,224 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,94,653 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,256 కు చేరింది. ప్రస్తుతం 23,203 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 19,251 మంది హోం క్వాంరంటైన్ లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజులో తెలంగాణ వ్యాప్తంగా 43,916 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 37,46,963 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

More Telugu News