బీసీలకు 34 శాతం రిజర్వేషన్లే మా లక్ష్యం: కాగిత కృష్ణప్రసాద్
- బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యం
- కోర్టు కేసులతో వైసీపీ అడ్డుకుంటోందని ఆరోపణ
- బీసీల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని వెల్లడి
- 34 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కూటమి ప్రభుత్వం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వైసీపీ అడ్డుకుంటోందని పెనమలూరు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆరోపించారు. కోర్టుల్లో కేసులు వేయిస్తూ బీసీలకు న్యాయం జరగకుండా వైసీపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కట్టుబడి ఉందని కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, ఆ తర్వాత చంద్రబాబు దానిని 34 శాతానికి పెంచి వారి అభివృద్ధికి బలమైన పునాది వేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అదే 34 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు సిద్ధమవుతుంటే, బీసీల సంక్షేమం ఇష్టం లేని వైసీపీ నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు వంటి బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధించారని కృష్ణప్రసాద్ విమర్శించారు. రిజర్వేషన్ల విషయంలోనూ రెండు పార్టీల వైఖరిలో స్పష్టమైన వ్యత్యాసం ఉందన్నారు. గతంలో హైకోర్టు ప్రతికూల తీర్పు ఇచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వం కేవలం 24 శాతం రిజర్వేషన్లకే పరిమితమైందని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం 34 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని వివరించారు.
బీసీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని ఆయన తెలిపారు. గౌడ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాలు, బార్ల కేటాయింపుల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించామని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు రూ. 25 వేల ఆర్థిక సాయంతో పాటు గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా చెల్లిస్తున్నామని చెప్పారు. మత్స్యకారులకు వేట నిషేధ భృతిని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచినట్లు వెల్లడించారు. బీసీలను ఉన్నత పదవుల్లో నిలబెట్టడమే టీడీపీ విధానమని, విద్యార్థి దశ నుంచే చంద్రబాబు బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.