బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు.. ఇది మా విధానం: టీడీపీ
- స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అమలుపై కీలక ప్రకటన
- చట్టపరంగా వీలుకాకపోయినా పార్టీపరంగా సీట్లు కేటాయిస్తామని వెల్లడి
- వైసీపీ వల్లే బీసీలు రిజర్వేషన్లు కోల్పోయారని టీడీపీ ఆరోపణ
- గత, ప్రస్తుత ప్రభుత్వాల్లో బీసీల కోసం అమలు చేస్తున్న పథకాల వెల్లడి
- బీసీల రాజకీయ ఎదుగుదలకు ఎప్పుడూ అండగా ఉంటామని స్పష్టీకరణ
- సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టీడీపీ ప్రకటన
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో తెలుగుదేశం పార్టీ తన విధానాన్ని స్పష్టం చేసింది. చట్టపరమైన ఆమోదం లభించకపోయినా, పార్టీ తరఫున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించి వారి రాజకీయ గౌరవాన్ని కాపాడతామని కీలక ప్రకటన చేసింది. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు జీవో 105, 1065 ద్వారా 34 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేశామని, అయితే వైసీపీ నేతలు కోర్టులకు వెళ్లడం వల్లే హైకోర్టు ఆ జీవోలను కొట్టివేసిందని టీడీపీ ఆరోపించింది.
ఈ విషయంలో తాము వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించామని, సీనియర్ న్యాయవాదులను నియమించి పోరాడినా దురదృష్టవశాత్తు అనుకూల తీర్పు రాలేదని తెలుగుదేశం పార్టీ గుర్తుచేసింది. అయినా సరే, బీసీల విషయంలో తమ నిబద్ధతను చాటుకుంటామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా 34 శాతానికి తగ్గకుండా బీసీ వర్గాలకు సీట్లు కేటాయిస్తామని ఉద్ఘాటించింది. బీసీల రాజకీయ ఎదుగుదలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి న్యాయం చేయడమే తమ లక్ష్యమని, కానీ వారి హక్కులను అడ్డుకోవడమే వైసీపీ వైఖరి అని విమర్శించింది.
కుట్రలు చేసి, కోర్టులకు వెళ్లి రిజర్వేషన్లు పోయేలా చేసి, మళ్లీ తమపైనే ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టింది. నాడు హైకోర్టు రిజర్వేషన్లు కొట్టివేసినప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ, బీసీలకు న్యాయం చేసేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదని ఆక్షేపించింది.
బీసీలకు అండగా నిలిచింది టీడీపీనే
బీసీలకు రాజ్యాధికారం అనే మాటను తొలిసారిగా పలికి, వారికి అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీయేనని ఈ సందర్భంగా టీడీపీ గుర్తుచేసింది. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కారణంగా నాలుగు దశాబ్దాల క్రితమే బీసీల గళం వినిపించిందని, ఆ తర్వాత తాము ఆ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లామని తెలిపింది. 1995లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచిన ఘనత తమదేనని పేర్కొంది. బీసీలు తమకు అండగా ఉన్నారనే అక్కసుతోనే గత వైసీపీ ప్రభుత్వం వారిని అణగదొక్కే ప్రయత్నం చేసిందని, 30 ఏళ్లుగా అమలవుతున్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని ఆరోపించింది. దీనివల్ల సుమారు 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసింది.
గత, ప్రస్తుత ప్రభుత్వాల్లో బీసీలకు మేలు
బీసీ ఫెడరేషన్లకు నాంది పలికింది కూడా తమ ప్రభుత్వమేనని టీడీపీ తెలిపింది. కులవృత్తులు, చేతివృత్తులను పరిరక్షించేందుకు, వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు 'ఆదరణ' వంటి పథకాలను తీసుకువచ్చామని, ఈ పథకం కింద 341 రకాల పనిముట్లను 90 శాతం సబ్సిడీతో అందించామని గుర్తుచేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించింది. ఇందులో భాగంగా వడ్డెర్లకు 10 శాతం మైనింగ్ లీజులు, గీత కార్మికులకు 10 శాతం ఎక్సైజ్ షాపులు కేటాయించామని తెలిపింది.
'నేతన్న సేవ' పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని, చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ మగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొంది.
వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించే పథకాన్ని తామే ప్రారంభించామని, ఇప్పుడు 'మత్స్యకార సేవ' పథకం కింద ఆ సహాయాన్ని రూ.20,000కు పెంచామని వివరించింది. సబ్సిడీపై బోట్లు, డీజిల్ అందిస్తూ, తీరప్రాంతంలో వారి హక్కులకు రక్షణ కల్పిస్తున్నామని తెలిపింది. గత ప్రభుత్వం అన్యాయంగా తెచ్చిన జీవో నెంబర్ 217ను రద్దు చేసి మత్స్యకార సొసైటీల హక్కులను కాపాడామని, మత్స్యకార మహిళలకు సీ వీడ్ పెంపకంపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పింది.
నాయీ బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, దేవాలయాల్లో పనిచేసే వారికి భృతిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచామని తెలిపింది. స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని పేర్కొంది. చట్టపరంగా ఏది ఏమైనప్పటికీ, రాజకీయంగా బీసీలకు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకుంటామని టీడీపీ పునరుద్ఘాటించింది.