తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్!
Add ap7am to your home Screen

తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్!

1021 new cases in telangana
  • గత 24 గంటల్లో కొత్తగా 1,021 కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,13,084
  • 1,87,342 మంది డిశ్చార్జ్  
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,021 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,214 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,13,084 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,87,342 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,228 కు చేరింది. ప్రస్తుతం 24,514 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 228, రంగారెడ్డి జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి.

Corona Virus
COVID19
Telangana

More Telugu News