Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్!

spike of 1717 new cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కొవిడ్ 19 కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,717 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,103 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,12,063 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,85,128 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,222 కు చేరింది. ప్రస్తుతం 25,713 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 276, రంగారెడ్డి జిల్లాలో 132 కేసులు నమోదయ్యాయి. వారిలో 21,209 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.  తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 35,47,051 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.  

తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు..

 
 
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News