అరెస్ట్ అయిన కన్నడ హీరోయిన్ల ఫోన్లలో బ్లూ ఫిల్మ్ లు... సెక్స్ రాకెట్ నడిపినట్టు అనుమానం!
- ప్రస్తుతం జైల్లో సంజన, రాగిణి
- వారి సెల్ ఫోన్లలో నగ్న వీడియోలు, చిత్రాలు
- సెక్స్ రాకెట్ కూడా నడిపినట్టు అనుమానం
ఓ వాట్స్ యాప్ గ్రూప్ ద్వారా వీరు దందాను నడిపించారని, డ్రగ్స్ కేసు బయటకు రాగానే ఆ గ్రూప్ ను వీరు డిలీట్ చేశారని చెబుతున్న సీసీబీ, ఈ విషయంలోనూ లోతుగా విచారించాల్సి వుందని అన్నారు. వీరు సెక్స్ రాకెట్ కూడా నడిపించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో సంబంధముందని భావిస్తున్న అందరికీ నోటీసులు పంపి విచారించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ కేసులో మరో ఇద్దరిని బెంగళూరులో సీసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కెంగేరికి చెందిన ఓ వ్యక్తిని, నైజీరియా వాసిని అరెస్ట్ చేసి మంగళూరుకు తరలించామని స్పష్టం చేశారు.
వీరు ముంబై, గోవా తదితర ప్రాంతాల నుంచి మాదకద్రవ్యాలను తీసుకుని వచ్చి మంగళూరులో అమ్ముతున్నట్లు తేలిందని, తమ అదుపులో ఉన్న డ్యాన్సర్ కిశోర్ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకు వీరిని అరెస్ట్ చేశామని అధికారులు వెల్లడించారు. తమ కస్టడీలో ఉన్న సమయంలో రాగిణి, సంజనలు ఇచ్చిన సమాచారం ఆధారంగా గత మూడు రోజుల నుంచి పలువురిని విచారించామని, వీరికి సన్నిహితంగా ఉన్నవారిని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. రాగిణి సన్నిహితులిద్దరిని చామరాజపేటలోని సీసీబీ కార్యాలయంలో విచారించామని, వారు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు రూఢీగా తెలిసిందని అన్నారు. ఈ వ్యవహారంలో ఇటీవల సస్పెండ్ అయిన ఓ ఏసీపీకి కూడా ప్రమేయం ఉన్నట్టు తెలిసిందని అన్నారు.