యాపిల్ నుంచి వస్తున్న చిన్న ఫోన్.. ఐ ఫోన్ 12 మినీ!

Leaks on Iphone 12
  • అక్టోబర్ లో విడుదల కానున్న కొత్త ఫోన్
  • పేరు ఐఫోన్ 12 మినీ
  • 5 జీ టెక్నాలజీతో కొత్త ఫోన్
ఐఫోన్ కొత్త మోడల్ వచ్చేస్తోంది. సంస్థ నుంచి 12వ తరం ఫోన్ గా, అక్టోబర్ లో దీన్ని విడుదల చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తుండగా, ఈ ఫోన్ గురించి మరో లీక్ బయటకు వచ్చింది. ఈ ఫోన్ చిన్నగా ఉంటుందని, కేవలం 5.4 అంగుళాల సైజ్ లో ఉండే దీని పేరు 'ఐఫోన్ 12 మినీ' అని తెలుస్తోంది. కాగా, తొలుత ఈ ఫోన్ ను 'ఐఫోన్ 12' అని పిలుస్తారని, 'ఐఫోన్ 12 మ్యాక్స్' అంటారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి, అక్టోబర్ లో ఈ ఫోన్ విడుదల కానుంది. కాగా, ఇప్పటికే ఐపాడ్, మాక్ కంప్యూటర్లలో యాపిల్ మినీ వర్షన్లను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో 4, 5వ తరం ఫోన్లు చిన్నవే. ఇక, ఈ కొత్త ఫోన్లు 5జీ రేడియో తరంగాలకు మద్దతిస్తాయని, ఓఎల్ఈడీ స్క్రీన్లు, 60 హెర్జ్ రిఫ్రష్ రేటు, అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తాయని సంస్థ ప్రతినిధులు అంటున్నారు.
Go Back to Shorts
Apple
Iphone
12 th Generation
Small Phone

More Telugu News