ఇద్దరు యంగ్ హీరోలతో మల్టీస్టారర్ ప్లానింగ్!
- రానా, నాని బయట మంచి స్నేహితులు
- వీరితో మల్టీస్టారర్ కి సురేశ్ బాబు ప్లానింగ్
- కథ తయారుచేస్తున్న ప్రముఖ దర్శకుడు
- యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిర్మాణం
అలాగే, దగ్గుబాటి రానా, నాని కూడా మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం వుంది. ఇప్పుడు వీరిద్దరూ కలసి ఓ మల్టీ స్టారర్ లో నటించే సూచనలు కనిపిస్తున్నాయి. వీరిద్దరితోనూ ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి రానా తండ్రి సురేశ్ బాబు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఓ ప్రముఖ దర్శకుడు ఇప్పటికే వీరికి సూటయ్యే కథపై వర్క్ చేస్తున్నట్టు చెబుతున్నారు.
ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారట. హీరోయిన్లు కూడా టాప్ కేటగిరీ అమ్మాయిలే ఉంటారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.