Corona Virus: తెలంగాణలో కొత్తగా 2,795 మందికి కరోనా

new 2795 coronavirus cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,795 కొత్త కేసులు నమోదయ్యాయని  తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,483 కి చేరింది. ఆసుపత్రుల్లో 27,600  మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 86,095  మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 788కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 449 కరోనా కేసులు నమోదయ్యాయి.              
                    
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News