ఒకరిని బాధించినప్పుడు.. అందుకు క్షమాపణ చెప్పడంలో తప్పేముంది?: ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు ప్రశ్న
- చీఫ్ జస్టిస్ లపై ప్రశాంత్ భూషణ్ ట్వీట్లు
- క్షమాపణ చెప్పేందుకు నిరాకరణ
- అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
తన ట్వీట్లపై ప్రశాంత్ భూషణ్ క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, క్షమాపణ చెప్పేందుకు ఆయన నిరాకరించారు. దీనిపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. ప్రశాంత్ భూషణ్ నుంచి తాము ఇలాంటి ప్రతిస్పందనను ఊహించలేదని వ్యాఖ్యానించింది. 30 ఏళ్లకు పైగా న్యాయవాదిగా అనుభవం ఉన్న ఈయన వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని చెప్పింది. ప్రశాంత్ భూషణ్ వంటి వ్యక్తి క్షమాపణలు చెపితే... దాని ప్రభావం సమాజంపై ఉంటుందని తెలిపింది. కోర్టు ధిక్కరణకు సంబంధించిన ఈ కేసులో సుప్రీం తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది.