Vijay Sai Reddy: గవర్నర్ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపాను: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy says he conveys his greetings to governor
షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్యాహ్నం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య నిశిత వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి వెంట ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా రాజ్ భవన్ కు వెళ్లడం ఆశ్చర్యంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో తన భేటీపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. రేపు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గవర్నర్ ను కలిశానని, ఆయనకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశానని వెల్లడించారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
Governor
Ganesh Chaturthi
Varla Ramaiah

More Telugu News