గుట్టుచప్పుడు కాకుండా మూడోపెళ్లి.. సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అరెస్ట్
- హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఘటన
- బ్యూటీపార్లర్ నిర్వాహకురాలితో తిరుపతిలో రహస్య వివాహం
- రెండో భార్య ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు
ఆ తర్వాత 2016లో శారద (38) అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఏడాది తర్వాత వీరికి పాప జన్మించింది. శంకరయ్యకు ఇటీవల బదిలీ అయింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగానే గతేడాది నవంబరు 30న సహారా రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహించే మంజులారాణి అనే మహిళను తిరుపతిలో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన బాధితురాలు శారద వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శంకరయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.