కీర్తి సురేశ్ తాజా చిత్రానికి ఓటీటీలో మంచి ఆఫర్!

Keerti Suresh film offered good amount in OTT
ఈ లాక్ డౌన్ కాలంలో ఓటీటీ వేదికలకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా పూర్తయిపోయి విడుదలకు రెడీగా వున్న సమయంలో థియేటర్లు మూతబడడంతో, కొందరు నిర్మాతలను ఈ ఓటీటీ ప్లాట్ ఫాంలే ఆదుకున్నాయి. నిర్మాతలు నష్టాలలో పడకుండా మంచి అమౌంట్ ఆఫర్ చేసి ఆయా సినిమాలను డైరెక్ట్ విడుదల కోసం కొనుగోలు చేశాయి. ఈ క్రమంలో కీర్తి సురేశ్ నటించిన పెంగ్విన్ చిత్రాన్ని కూడా ఆమధ్య అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకుని రిలీజ్ చేశారు.

అయితే, ఈ చిత్రానికి అంతగా రెస్పాన్స్ కనపడకపోవడంతో ఆమె తదుపరి చిత్రాలకు ఓటీటీలో మార్కెట్ సమస్య ఎదురవ్వచ్చని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆమె నటించిన మరో చిత్రం 'గుడ్ లక్ సఖి'ని కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థే తీసుకుంది. పైగా దీనికి 13 కోట్ల వరకు ఆఫర్ చేసినట్టు సమాచారం. దీనిని కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారా త్వరలో స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇక ఇందులో కీర్తి సురేశ్ పల్లెటూరి పిల్లగా నటించింది. ఆమెకు ప్రతి విషయంలోనూ దురదృష్టం ఎదురవుతుండడంతో అంతా ఆమెను 'బ్యాడ్ లక్ సఖి' అంటుంటారు. అలాంటి అమ్మాయి కృషి, పట్టుదలతో జాతీయ స్థాయి షార్ప్ షూటర్ గా అవార్డు గెలుచుకుని 'గుడ్ లక్ సఖి' అనిపించుకుంటుంది. నగేశ్ కుకునూర్ దీనికి దర్శకత్వం వహించాడు.
Go Back to Shorts
Keerti Suresh
Good Luck Sakhi
Penguin
Nagesh Kukunoor

More Telugu News