Sanchaita: కుమార్తెకు ఆస్తిలో సమాన హక్కుపై చంద్రబాబు ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన సంచయిత!

Sanchaita gives counter to Chandrababu
షార్ట్స్‌లో చూడండి
తల్లిదండ్రుల ఆస్తిలో కుమారుడితో పాటు కుమార్తెకు కూడా సమాన హక్కు ఉంటుందంటూ ఈరోజు సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ... సుప్రీంకోర్టు తీర్పు చాలా సంతోషకర విషయమని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు అశోక్ గజపతిరాజు అన్న కూతురు, మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచయిత కౌంటర్ ఇచ్చారు.

'చంద్రబాబు గారూ... మహిళల పక్షపాతి అయిన మీరు... నాపై దాడి చేయవద్దని అశోక్ గజపతిరాజు గారికి చెప్పండి. నేను అశోక్ గజపతిరాజు అన్న ఆనంద గజపతిరాజు చట్టబద్ధ వారసురాలిననే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను' అంటూ ఆమె ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Sanchaita
Mansas Trust
Chandrababu
Ashok Gajapathi Raju
Telugudesam

More Telugu News