రోడ్డుపై క్షతగాత్రుడు... కారు దిగి చికిత్స చేసిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే

YCP MLA Undavalli Sridevi helps an youth injured in an accident
గుంటూరు-హైదరాబాద్ రహదారిపై పిడుగురాళ్ల వద్ద ఓ క్షతగాత్రుడు రోడ్డుపై నిస్సహాయ స్థితిలో పడివుండగా, కరోనా భయాలను కూడా లెక్కచేయకుండా వైసీపీ మహిళా ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ప్రథమ చికిత్స చేశారు.

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హైదరాబాద్ వెళుతుండగా మార్గమధ్యంలో ఓ యువకుడు బైక్ యాక్సిడెంట్ లో గాయాలతో రోడ్డుపై పడి ఉండడం చూశారు. కరోనా భయంతో అతడికి సాయం చేసేందుకు స్థానికులెవరూ ముందుకు రాలేదు. అదే సమయానికి ఎమ్మెల్యే శ్రీదేవి ఆ మార్గంలో ప్రయాణిస్తుండడంతో ఈ దృశ్యం కంటబడింది. వెంటనే కారు ఆపిన ఆమె ఆ యువకుడికి ఫస్ట్ ఎయిడ్ చేసి, ఆపై 108కి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చిన తర్వాత విషయం వివరించి, ఆపై హైదరాబాద్ పయనమయ్యారు.
Go Back to Shorts
Undavalli Sridevi
MLA
Biker
Injured
First Aid
Corona Virus

More Telugu News