సిగ్గు లేకుండా మాకు డెడ్ లైన్ పెట్టడం ఏమిటి?: జోగి రమేశ్
- 14 నెలల క్రితమే చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు
- ఏపీలో ప్రతిపక్షమే లేదు
- చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాదుకు పారిపోయారు
14 నెలల క్రితమే చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారని... అయినా సిగ్గు లేకుండా తమకు డెడ్ లైన్ పెట్టడం ఏమిటని జోగి రమేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని చెప్పారు. చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతి నుంచి హైదరాబాదుకు పారిపోయారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉండాలా? వద్దా? అనే విషయంపై ప్రజలే ఆలోచించుకోవాలని చెప్పారు.