తెలంగాణ బీజేపీలో చిచ్చు రేపిన రాష్ట్ర కమిటీ కూర్పు
- బీజేపీలో నన్ను మరోసారి పక్కన పెడుతున్నారు
- గ్రూపు రాజకీయలను ఆపాలి
- బండి సంజయ్ కి రాజాసింగ్ వాట్సాప్ మెసేజ్
బీజేపీలో తనను మరోసారి పక్కనపెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వాట్సాప్ ద్వారా ఆయన మెసేజ్ పెట్టారు. కనీసం మీ నాయకత్వంలోనైనా రాష్ట్ర బీజేపీలో మార్పు వస్తుందని భావించానని.. కానీ, తనకు అది కనిపించడం లేదని చెప్పారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను ఆపేందుకు ప్రయత్నించాలని విన్నవించారు. అందరం కలసికట్టుగా పని చేసి, పార్టీని బలోపేతం చేద్దామని చెప్పారు.