iaf: కాసేపట్లో ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు బయల్దేరనున్న ఐదు రాఫెల్‌ యుద్ధ విమానాలు

  • ఫ్రాన్స్ నుంచి 36 యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం
  • దశల వారీగా దేశానికి చేరుకోనున్న విమానాలు
  • ఈ నెల 29న హర్యానాలోని అంబాలాకు 5 విమానాలు
 Rafale fighter aircraft to take off for India from France

ఫ్రాన్స్ నుంచి 36 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ విమానాలు దశల వారీగా దేశానికి చేరనున్నాయి. ఈ నెల 29న హర్యానాలోని అంబాలాకు ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు చేరుకోవాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం, అనుకున్న సమయానికే అవి చేరుతున్నాయి.

ఇక ఫ్రాన్స్ నుంచి కాసేపట్లో ఈ రాఫెల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు బయలుదేరనున్నాయి. ఆ దేశంలోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు టేకాఫ్ అవుతాయి. మార్గ మధ్యంలో అబుదాబి సమీపంలోని అల్-దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్‌బేస్ వద్ద ఆగుతాయి. కాగా, తొలిదశలో భాగంగా వస్తోన్న ఈ ఐదు యుద్ధ విమానాల్లో రెండు ట్రైనర్ విమానాలు, మూడు యుద్ధ విమానాలు ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.

More Telugu News