Dr Subbaiah: ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిపై చెన్నై మహిళ ఫిర్యాదు.... తన ఇంటి ముందు మూత్ర విసర్జన చేశాడని ఆరోపణ

Woman complains against ABVP National President Dr Subbaiah
షార్ట్స్‌లో చూడండి
ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సుబ్బయ్య షణ్ముగం తన నివాసం ముందు కక్షపూరితంగా మూత్రవిసర్జన చేశాడని ఆరోపిస్తూ చెన్నైకి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నైలోని నంగనల్లూర్ ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో 60 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తోంది. ఏబీవీపీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ సుబ్బయ్య షణ్ముగం కూడా ఆ అపార్ట్ మెంట్ లోనే నివసిస్తున్నారు. అయితే, డాక్టర్ సుబ్బయ్యకు, వృద్ధురాలికి కారు పార్కింగ్ వద్ద వివాదం జరిగింది.

ఈ నేపథ్యంలో మరుసటి రోజు ఉదయం తమ ఇంటి తలుపు తీయగానే మూత్రం వాసన వస్తుండడంతో మహిళ సీసీటీవీ ఫుటేజి పరిశీలించింది. డాక్టర్ సుబ్బయ్య మూత్రవిసర్జన చేసినట్టు విజువల్స్ ద్వారా స్పష్టమైంది. ఈ వీడియో ఆధారాలతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడంలేదని ఆ మహిళ విచారం వ్యక్తం చేశారు. సుబ్బయ్య తన పలుకుబడి ఉపయోగించి పోలీసులను మేనేజ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై ఏబీవీపీ స్పందిస్తూ, ఆ వీడియో ఫేక్ అని కొట్టిపారేసింది. తమ అధ్యక్షుడ్ని అప్రదిష్ఠ పాల్జేయడానికే ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది.
Go Back to Shorts
Dr Subbaiah
ABVP
Woman
Chennai
Police

More Telugu News