వికాస్ దూబే వంటి కరుడుగట్టిన నేరస్తుడు బెయిల్ పై బయట తిరిగాడా..!: సుప్రీంకోర్టు విస్మయం
- ఎన్ కౌంటర్ లో దూబే హతం
- దూబేపై యూపీలో 60కి పైగా కేసులు
- ఇది వ్యవస్థ వైఫల్యమేనంటూ సుప్రీం వ్యాఖ్యలు
లెక్కకు మిక్కిలి కేసులున్న వికాస్ దూబే వంటి నేరగాడు బెయిల్ పై స్వేచ్ఛగా తిరిగాడన్న అంశం భీతిగొలుపుతోంది అని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అది మీ విధి అని అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు యూపీ సొలిసిటర్ జనరల్ కు బోబ్డే, ఏఎస్ బోపన్న, వి.రామసుబ్రమణియన్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం నిర్దేశించింది. వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై దాఖలైన పిటిషన్లను విచారించిన సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.