సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Payal Rajputh item song in Pushpa film
  • బన్నీ సినిమాలో పాయల్ ఐటెం సాంగ్ 
  • శేఖర్ కమ్ముల చిత్రానికి భారీ రేటు
  • 'బిగ్ బాస్ 4'లో హాట్ బ్యూటీ
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందే 'పుష్ప' చిత్రం షూటింగును ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోపక్క, ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగు ఉందనీ, దానికోసం హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేశారనీ ప్రచారం జరుగుతోంది.
*  నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రం షూటింగుకు సంబంధించి ఇక కొంత భాగం మాత్రం మిగిలివుంది. త్వరలోనే దీనిని పూర్తిచేస్తారు. కాగా, ఈ చిత్రం శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ హక్కులు 18 కోట్లకు అమ్ముడుపోయినట్టు తాజా సమాచారం.  
*  త్వరలో ప్రారంభం కానున్న 'బిగ్ బాస్ 4' రియాలిటీ షో కోసం పార్టిసిపేంట్ల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా కథానాయిక పూనం బజ్వాను ఒక పార్టిసిపేంట్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనికి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారు.
Go Back to Shorts
Payal Rajputh
Allu Arjun
Sai Pallavi
Nagarjuna
Poonam Bhajwa

More Telugu News