గల్వాన్ ప్రాంతం ఎప్పటికీ భారత్‌దే: మహ్మద్ అమిన్ గల్వాన్
- లార్డ్ డన్మోర్ బృందాన్ని కాపాడినందుకు గుర్తుగా మా తాత పేరు
- 19వ శతాబ్దం మధ్యలో టిబెట్, 1962లో చైనా విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించాయి
- చైనా అప్పుడు, ఇప్పుడు ఒకేలా ప్రవర్తిస్తోంది
తన తాతకు 12 ఏళ్ల వయసున్నప్పుడు ఒకసారి లార్డ్ డన్మోర్ బృందం ఈ ప్రాంతానికి విహారయాత్రకు వచ్చిందని, అయితే, ఆక్సాయిచిన్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా డన్మోర్ బృందం దారి తప్పిందని అన్నారు. వారికి దారి చూపించే క్రమంలో తన తాతయ్య నది ఒడ్డుకు చేరుకుని వేరే మార్గం ద్వారా వారిని తప్పించి కాపాడారని పేర్కొన్నారు. మరణం అంచుల వరకు వెళ్లిన వారిని కాపాడినందుకు గుర్తుగా డన్మోర్ ఈ ప్రాంతానికి ఆయన పేరు పెట్టారని రసూల్ గల్వాన్ వివరించారు.
19వ శతాబ్దం మధ్యలో రష్యా ఒకసారి టిబెట్‌లో విస్తరణ పనులు చేపట్టిందని, అప్పుడు తన తాత బ్రిటిష్ విస్తరణ బృందానికి గైడ్‌గా ఉన్నట్టు చెప్పారు. రష్యా కదలికలపై అంచనా వేసి బ్రిటిష్ బృందానికి ఆయన సరైన దారిచూపడంతో రష్యా ఆటలు సాగలేదని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 1962 ప్రాంతంలో చైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసిందన్నారు. ఈ ప్రాంతం ఎప్పటికీ భారత్‌దేనని ఆయన తేల్చి చెప్పారు. అప్పుడు, ఇప్పుడు చైనీయులు అలానే చేస్తున్నారని, మన సైనికుల త్యాగాలకు జోహార్లు అని రసూల్ పేర్కొన్నారు.