Rashmika Mandanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • డబ్బింగ్ చెబుతానంటున్న రష్మిక 
  • విడుదలకు రెడీగా 'ఉప్పెన'
  • విజయ్ సేతుపతి హీరోగా తెలుగు సినిమా  
Rashmika to dub herself in forth coming film

*  త్వరలోనే తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెబుతానంటోంది అందాలతార రష్మిక. ప్రస్తుతం తాను నటిస్తున్న 'పుష్ప' చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఆమె భావిస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రంలోని తన డైలాగులని తీసుకుని ఇప్పటికే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టిందట.
*  మెగా ఫ్యామిలీకి చెందిన వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న 'ఉప్పెన' చిత్రం విడుదలకు రెడీ అయింది. ఫైనల్ ఎడిటింగ్ తర్వాత రన్ టైంను రెండు గంటల ముప్పై నిమిషాలుగా సెట్ చేశారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని థియేటర్లు తెరుచుకోగానే విడుదల చేస్తారు.
*  'ఉప్పెన' చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన తమిళ నటుడు విజయ్ సేతుపతి త్వరలో ఓ తెలుగు చిత్రంలో హీరోగా నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

More Telugu News