మా బస్సులను అనుమతించండి... తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలకు ఏపీ వినతి!
- లేఖ రాసిన నీలం సాహ్ని
- ఇప్పటికే బస్సులను నడపాలంటున్న కలెక్టర్లు
- ఇంకా నిర్ణయం తీసుకోని తెలంగాణ
కాగా, ప్రైవేటు వాహనాలు, రైళ్లలో భారీ ఎత్తున ప్రజలు వస్తుండటంతో, వారందరి వివరాలు సేకరించడం కష్టంగా ఉందని ఇటీవల ఏపీ జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వం వద్ద వాపోయిన సంగతి తెలిసిందే. వెంటనే బస్సులను అనుమతించాలని వారు రవాణా శాఖను కోరారు. ఇక తెలంగాణ రాష్ట్రం అంతర్రాష్ట్ర ప్రయాణికులను అనుమతిస్తున్నప్పటికీ, బస్సుల విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ విషయంలో స్పష్టమైన విధానాన్ని తెలంగాణ ప్రకటించాలని ఏపీ కోరుతోంది. ఈ విషయంలో మరో రెండు రోజుల్లో నిర్ణయం వెలువడవచ్చని, సోమవారం నుంచి బస్సులు తిరిగి ప్రారంభం అవుతాయని సమాచారం.