చిరంజీవి సినిమాలో జెనీలియా?
- పలు చిత్రాల ద్వారా అలరించిన జెనీలియా
- తెలుగులో కడపటి చిత్రం 'నా ఇష్టం'
- సుజీత్ దర్శకత్వంలో 'లూసిఫర్' రీమేక్
- కీలక పాత్రకు జెనీలియా ఎంపిక
మలయాళంలో సూపర్ హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చరణ్ తెలుగులో తన తండ్రి చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్నాడు. దీనికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 'ఆచార్య' సినిమా తర్వాత చిరంజీవి ఈ చిత్రాన్నే చేయనున్నారు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం జెనీలియాను సంప్రదించినట్టు తాజా సమాచారం. ఆమె కూడా ఈ పాత్ర చేయడానికి ఆసక్తిని చూపుతోందట. సో.. అమ్మడి టాలీవుడ్ పునఃప్రవేశం చిరంజీవి చిత్రం ద్వారా జరిగే ఛాన్స్ వుందన్న మాట!