ఆయా హీరోల గురించి అడిగితే... హీరోయిన్ లావణ్య త్రిపాఠి సమాధానాలివి!
- నెటిజన్లతో సంభాషించిన లావణ్య
- 'రంగస్థలం' అంటేనే ఓ అద్భుతం
- 'ఆర్ఆర్ఆర్' లుక్ కోసం వేచి చూస్తున్నా
ఇక జూనియర్ ఎన్టీఆర్ ను ఎవరూ మ్యాచ్ చేయలేరని, ఆయన తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్' లో లుక్ కోసం వెయిట్ చేస్తున్నానంది. షారూఖ్ నటించిన చిత్రాల్లో 'చక్ దే ఇండియా' ఇష్టమని వెల్లడించింది. అల్లు అర్జున్ పేరు ప్రస్తావనకు రాగానే, 'పుష్ప' ఫస్ట్ లుక్ చింపేసిందని, ఇంకో బ్లాక్ బస్టర్ ఖాయంగా వస్తుందన్న నమ్మకం ఉందని చెప్పింది.
పవన్ కల్యాణ్, ప్రతి విషయంపైనా స్పందిస్తారని, ఆయన ధైర్యంపై తనకు ఎంతో గౌరవం ఉందని, నిజమైన హీరో మెగాస్టార్ చిరంజీవని, తాను ఆరాధించే నటుల్లో ఆయన ఒకరని తెలిపింది. చిరంజీవి చాలా మంచి వ్యక్తని, ఆయనలోని దయాగుణం, వినయం తనకు ఆదర్శమని పేర్కొంది.