నిహారిక పెళ్లి గురించి స్పందించిన నాగబాబు

Nagababu
  • వచ్చే ఏడాది నిహారిక పెళ్లి
  • ఆమెను డాక్టర్ గా చూడాలని ఉండేది
  • పిల్లలపై నా ఇష్టాన్ని రుద్దలేదన్న నాగబాబు
మొదటి నుంచి కూడా నాగబాబుకి తాను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పడం అలవాటు. ఎలాంటి మొహమాటాలకు పోకుండా ఆయన తాను చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తుంటారు. తాజాగా ఆయన మాట్లాడుతూ నిహారిక పెళ్లిని గురించి ప్రస్తావించారు.

"నిహారికకి సంబంధాలు చూస్తున్నాము. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఆమె పెళ్లిని జరిపించే అవకాశాలు ఎక్కువ. ఆ వెంటనే వరుణ్ తేజ్ కి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసే ఆలోచన వుంది. వచ్చే ఏడాది చివరిలోగానీ .. 2022 ప్రథమార్థంలోగాని వరుణ్ పెళ్లి జరిపించే ఆలోచన వుంది. ఆ దిశగానే ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాము. పిల్లల పెళ్లిళ్లు అనే బాధ్యత ప్రస్తుతం నాపై వుంది .. ఆ బాధ్యత నుంచి బయటపడితే నేను ఫ్రీ అవుతాను. వరుణ్ తేజ్ ను ఐపీఎస్ గా చూడాలనే కోరిక ఉండేది. అలాగే నిహారికను డాక్టర్ గా చూడాలనుకున్నాను. కానీ నా ఇష్టాన్ని వాళ్లపై రుద్ద దలచుకోలేదు. వాళ్లకి ఇష్టమైన మార్గంలో వెళ్లడానికి నా వంతు సహకారాన్ని అందించాను"  అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Nagababu
Varun Tej
Niharika

More Telugu News