సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రకుల్ లాక్ డౌన్ కబుర్లు
- సూర్యకు నిర్మాతల మద్దతు
- 'లాక్ డౌన్' సినిమాలో ఆండ్రియా
* తన భార్య జ్యోతిక నటించిన 'పొన్ మాగల్ వందల్' చిత్రాన్ని థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీ ప్లాట్ ఫారంపై విడుదల చేయడానికి అమెజాన్ తో హీరో సూర్య ఒప్పందం కుదుర్చుకోవడం వివాదాస్పదమైంది. దీంతో తమిళ ఎగ్జిబిటర్లు సూర్య చిత్రాలను బహిష్కరిస్తున్నామంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సూర్యకు 30 మంది తమిళ నిర్మాతలు బాసటగా నిలిచి, ఎగ్జిబిటర్ల నిర్ణయాన్ని ఖండించారు.
* 'లాక్ డౌన్' పేరుతో రూపొందుతున్న ఓ షార్ట్ ఫిలింలో కథానాయిక ఆండ్రియా జేర్మియా నటిస్తోంది. థ్రిల్లర్ గా రూపొందే ఈ లఘు చిత్రానికి తమిళ నటుడు అధవ్ కన్నదాసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రస్తుత లాక్ డౌన్ అనుభవాలను చూపిస్తారట.