Vijay Devarakonda: 'గీత గోవిందం' బన్నీ చేయకపోవడానికి కారణం అదే

  • భారీ విజయాన్ని సాధించిన 'గీత గోవిందం'
  • గీతా ఆర్ట్స్ 2 పై నిర్మాణం
  • కొత్త హీరోనే కరెక్ట్ అని చెప్పిన బన్నీ
Geeta Govindam Movie

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'గీత గోవిందం' భారీ విజయాన్ని సాధించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టింది. ఇంత మంచి కథను బన్నీ ఎందుకు చేయలేదనే సందేహం చాలా మందికి కలిగింది.

ఈ సినిమా కథతో గీతా ఆర్ట్స్ కి దర్శకుడు పరశురామ్ వచ్చినప్పుడు, బన్నీ అక్కడే వున్నాడట. పరశురామ్ కథ వినిపించిన తరువాత, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాలో తను చేయాలని ముచ్చటపడ్డాడట కూడా. అయితే అంతకు ముందు 'సరైనోడు' వంటి మాస్ హిట్ ఇచ్చిన తను, ఆ వెంటనే ఇంతటి సున్నితమైన లవ్ స్టోరీ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడట. ఈ కథకు కొత్త హీరో అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేసినట్టుగా సమాచారం.

More Telugu News