నేనింకా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలోనే ఉన్నాను: దర్శకుడు మారుతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేనింకా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలోనే ఉన్నాను: దర్శకుడు మారుతి

Maruthi Movie
  • గతంలో సక్సెస్ సాధించిన 'భలే భలే మగాడివోయ్'
  • నానితో మారుతి సినిమా అంటూ ప్రచారం
  • ఈ విషయంపై స్పందించిన మారుతి  
నాని కథానాయకుడిగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన 'భలే భలే మగాడివోయ్' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు నాని కెరియర్లోను .. ఇటు మారుతి కెరియర్లోను ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. అప్పటి నుంచి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ ప్రచారంపై తాజాగా మారుతి స్పందిస్తూ .. "నా తదుపరి సినిమా పట్ల ఆసక్తిని కనబరుస్తున్నందుకు ఆనందంగా వుంది. అయితే నాని హీరోగా సినిమా చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేనింకా స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలోనే వున్నాను. అది పూర్తయిన తరువాత, అందుకు సంబంధించిన వివరాలను నేనే స్వయంగా చెబుతాను" అన్నాడు.
Nani
Bhale Bhale Mogadivoy Movie
Maruthi

More Telugu News