సినీ కార్మికులకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన చిరంజీవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినీ కార్మికులకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన చిరంజీవి

Chiranjeevi donates one crore to Tollywood cine workers
  • కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్
  • ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులు
  • సినీ కార్మికులపై లాక్ డౌన్ ప్రభావం తీవ్రంగా ఉందన్న మెగాస్టార్
దేశంలో లాక్ డౌన్ ప్రభావంతో సర్వం నిలిచిపోయిన పరిస్థితుల్లో టాలీవుడ్ సినీ కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించారు. కరోనా విలయంతో లాక్ డౌన్ తప్పనిసరి కావడంతో దినసరి కూలీలు, అల్పాదాయ వర్గాలపైనే కాకుండా సినీ కార్మికులపైనా తీవ్ర ప్రభావం పడుతోందని చిరంజీవి ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీపై ఆధారపడిన సినీ కార్మికులకు రూ.1 కోటి విరాళం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తన విరాళం సినీ కార్మికులకు ఉపకరిస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు.
Chiranjeevi
Tollywood
Labour
Donation
Corona Virus
Lockdown

More Telugu News