దక్షిణాది సినీ కార్మికులకు రూ.10 లక్షల విరాళం ప్రకటించిన హీరో సూర్య కుటుంబం
- దేశంలో కరోనా ఉద్ధృతి
- నిలిచిపోయిన షూటింగులు
- ఉపాధిలేక అల్లాడుతున్న సినీ కార్మికులు
ఈ నేపథ్యంలో దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం 'ఫెఫ్సీ'కి హీరో సూర్య కుటుంబం విరాళం ప్రకటించింది. సూర్య, ఆయన తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీ సినీ కార్మికుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ రూ.10 లక్షల విరాళం అందించాలని నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇండస్ట్రీ మూతపడడంతో ఉపాధి కోల్పోయిన కార్మికుల కోసం ఈ విరాళం అందిస్తున్నట్టు తెలిపారు.