Allu Arjun: పారితోషికాన్ని రెట్టింపు చేసిన బన్నీ?

Sukumar Movie
షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్ పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది. భారీగా ఆయన పారితోషికాన్ని పెంచేసిన విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన తన పారితోషికాన్ని పెంచేయడానికి కారణం, 'అల వైకుంఠపురములో' సాధించిన వసూళ్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బన్నీ నుంచి ఇటీవల వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. 150 కోట్లకి పైగా షేర్ ను సాధించింది. ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. దాంతో బన్నీ తదుపరి సినిమాకి గాను పారితోషికాన్ని పెంచేసినట్టు చెబుతున్నారు. ఇంతకుముందు సినిమా వరకూ 15 కోట్లు తీసుకున్న బన్నీ, అంతకి రెట్టింపుగా తన పారితోషికాన్ని పెంచేశాడని అంటున్నారు. ఆయన తదుపరి సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో .. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, రెండవ షెడ్యూల్ కి సిద్ధమవుతోంది.
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Sukumar Movie

More Telugu News