Surya: నాయకుడు ఆయనే .. ప్రతినాయకుడు ఆయనే!

  • హరి దర్శకత్వంలో రూపొందుతున్న 'అరువా'
  • కవల సోదరులుగా కనిపించనున్న సూర్య 
  • అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్న కాంబినేషన్   
Aruva Movie

సూర్య తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'ఆకాశమే నీ హద్దురా' ముస్తాబవుతోంది. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి వుంది. తదుపరి ప్రాజెక్టును ఆయన హరి దర్శకత్వంలో చేస్తున్నాడు.  'అరువా' అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది తాజా సమాచారం.

గతంలో సూర్య 'బ్రదర్స్' సినిమాలో కవల సోదరులుగా కనిపించాడు. ఆయన కెరియర్లోనే ఆ సినిమా వైవిధ్యభరితమైనదిగా నిలిచిపోయింది. అలాగే 'అరువా' సినిమాలోను సూర్య కవల సోదరులుగా కనిపించనున్నాడు. ఒక పాత్రలో మంచివాడిగా .. మరో పాత్రలో దుర్మార్గుడిగా ఆయన కనిపించనున్నట్టు చెబుతున్నారు. అంటే ఈ సినిమాలో హీరో ఆయనే .. విలన్ ఆయనేనన్న మాట. వరుస విజయాలను తమ ఖాతాలో వేసుకున్న ఈ కాంబినేషన్లో ఈ ప్రయోగాత్మక చిత్రం రూపొందుతుండటం ఆసక్తికరంగా మారింది.

More Telugu News