Local Body Polls: ఏపీలో ఎన్నికల వాయిదా నిలిపివేయాలన్న పిటిషన్​పై రేపు ‘సుప్రీం’లో విచారణ

  • ‘స్థానిక’ ఎన్నికల వాయిదా ఉత్తర్వుల రద్దుకు ఏపీ సర్కార్ పిటిషన్
  • నిన్న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు 
  • సీజేఐ బాబ్డే ఆధ్వర్యంలో విచారణకు అవకాశం
Supreme Court to hear Ap govenment petetion tomorrow

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రేపు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పై  విచారణ జరగనుంది. సీజేఐ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగే అవకాశం ఉంది.

కాగా, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఉత్తర్వులు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్ లో కోరింది.

More Telugu News