Gutta Jwala: మేం డేటింగ్ లో ఉన్నాం, త్వరలోనే ఒక్కటవుతాం: గుత్తా జ్వాల

Gutta Jwala tells about her relationship
షార్ట్స్‌లో చూడండి
భారత బ్యాడ్మింటన్ రంగంలో సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్, పీవీ సింధు ఎలాగో డబుల్స్ రంగంలో గుత్తా జ్వాల కూడా అదేస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. తాజాగా ఆమె కోచింగ్ రంగంలో అడుగుపెట్టి సొంత అకాడమీ కార్యకలాపాలతో తీరికలేకుండా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జ్వాల ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తమిళ నటుడు విష్ణు విశాల్ తో రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించగా... తామిద్దరం డేటింగ్ లో ఉన్నామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని తెలిపింది. అయితే పెళ్లి ఎప్పుడన్నది చెప్పలేనని, అందరికీ చెప్పే చేసుకుంటానని పేర్కొంది.

అంతేకాదు, జ్వాల ప్రస్తుత రాజకీయాలపైనా తన అభిప్రాయాలను పంచుకుంది. కొన్ని జాతీయ పార్టీలు తనను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించాయని, అయితే తన భావజాలానికి తగిన పార్టీలు ఏవీ కనిపించలేదని, అందుకే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. తన కెరీర్ గురించి చెబుతూ, ఒకప్పుడు డబుల్స్ క్రీడాకారులకు దిశానిర్దేశం చేసేందుకు ఎవరూ ఉండేవారు కాదని, కానీ ఇప్పుడు దేశంలోని డబుల్స్ ప్లేయర్లకు మార్గదర్శనం చేసేందుకు తానున్నానని జ్వాల ఉద్ఘాటించింది.
Go Back to Shorts
Gutta Jwala
Vishnu Vishal
Dating
Relationship
Badminton
Academy
Doubles

More Telugu News