Allu Arjun: లారీ డ్రైవింగ్ నేర్చుకుంటున్న బన్నీ!

  • సుకుమార్ తో అల్లు అర్జున్ మూవీ 
  • ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ 
  • కీలకమైన పాత్రల్లో జగపతిబాబు .. విజయ్ సేతుపతి  
Sukumar Movie

అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. అధికారికంగా ఏ విషయమూ బయటికి రాకపోవడంతో, అభిమానులు ఇంకా సందేహంగానే వున్నారు.

అయితే కొన్ని రోజులుగా అల్లు అర్జున్ లారీ డ్రైవింగులో శిక్షణ తీసుకుంటున్నట్టుగా ఒక వార్త బయటికి వచ్చింది. దాంతో ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించేది నిజమేనని తెలుస్తోంది. బీడీ తాగుతూ .. లుంగీ పైకి కట్టి .. పూర్తి మాస్ లుక్ తో చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఉంటాడట. రష్మిక కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, జగపతిబాబు .. విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

More Telugu News