Jagan: జగన్‌ 'ట్రెండ్‌ సెట్టర్‌'.. కేసీఆర్‌ సహా ఆయనను ఫాలో అవుతున్న ముఖ్య‌మంత్రులు వీరే!: వైసీపీ

ycp on jagan rule
షార్ట్స్‌లో చూడండి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి నేటితో తొమ్మిదేళ్లు పూర్తయి, పదో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి వైసీపీ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పలు అంశాలను వివరించింది. ఏపీలో వైఎస్‌ జగన్‌ సుపరిపాలన అందిస్తున్నారని, ఆయనను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్నారని తెలిపింది. ఆయనో ట్రెండ్‌ సెట్టర్‌ అని పేర్కొంది.

సీఎం జగన్‌ ఏపీలోని ప్రభుత్వ బడుల్లో తీసుకొచ్చిన 'ఇంగ్లిష్‌ మీడియం'ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాలో అవ్వాలనుకుంటున్నారని పేర్కొంది. అధికార వికేంద్రీకరణను కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అనుసరించాలనుకుంటున్నారని తెలిపింది.

దిశ చట్టం గురించి తెలపమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కోరారని పేర్కొంది. దిశ అమలు చట్టాన్ని అమలు చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. వికేంద్రీకరణ కోసం 3 రాజధానుల ఏర్పాటు కోసం ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ , జార్ఖండ్ సీఎం హేమంత్‌ సొరేన్‌ ఆలోచిస్తున్నారని గుర్తు చేసింది.

'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 9 ఏళ్లు పూర్తి చేసుకుని, 10వ సంవ‌త్స‌రంలోకి అడుగిడుతున్న సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, నాయ‌కులంద‌రికీ  పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు' అని పేర్కొంది.
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News