రోడ్డుపై గాయాలతో యువకుడు విలవిల.. ఆసుపత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్న అఖిలేశ్ యాదవ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోడ్డుపై గాయాలతో యువకుడు విలవిల.. ఆసుపత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్న అఖిలేశ్ యాదవ్

Akhilesh Yadav helped injured bike rider
  • అఖిలేశ్‌పై కురుస్తున్న ప్రశంసల వర్షం
  • అతడికొచ్చిన ప్రమాదం ఏమీ లేదన్న వైద్యులు
  • అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని కార్యకర్తలకు ఆదేశం
రోడ్డుపై గాయాలతో విలవిల్లాడుతున్న ద్విచక్ర వాహనదారుడిని చూసిన యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అతడిని ఆసుపత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. సైఫైలో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొని అఖిలేశ్ యాదవ్ తిరిగి కారులో లక్నో బయలుదేరారు.

ఈ క్రమంలో తాల్‌గ్రామ్ సమీపంలో ఓ ద్విచక్ర వాహనాదారుడు రోడ్డు పక్కన గాయాలతో విలవిల్లాడుతుండడాన్ని చూశారు. వెంటనే కారు ఆపి కిందికి దిగిన మాజీ సీఎం.. అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడు ఎవరో తెలుసుకుని ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. అతడికొచ్చిన ప్రమాదం ఏమీ లేదని త్వరలోనే కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన నెటిజన్లు అఖిలేశ్‌ను ప్రశంసిస్తున్నారు.
Uttar Pradesh
Akhilesh Yadav
Biker
Road Accident

More Telugu News