Varla Ramaiah: మీరలా చేస్తే.. నేను రాజ్యసభ పోటీ నుంచి తప్పుకుంటాను: జగన్‌కి వర్ల రామయ్య సవాలు

  • నత్వానీని తీసేసి ఓ దళితుడిని పోటీకి దింపాలి
  • వైసీపీలో ఉన్న నాయకత్వానికి సవాలు చేస్తున్నాను
  • నేను పోటీ నుంచి తప్పుకుంటాను
  • నేను నా పార్టీని ఒప్పిస్తాను 
valra ramaiah fires on ycp leaders

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్‌ నత్వానీకి రాజ్యసభ టికెట్‌ ఇచ్చిన విషయంపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు.

'నత్వానీని తీసేసి ఓ దళితుడిని పోటీకి దింపాలి. వైసీపీలో ఉన్న నాయకత్వానికి సవాలు చేస్తున్నాను. నేను పోటీ నుంచి తప్పుకుంటాను. నేను నా పార్టీని ఒప్పిస్తాను. 13వ తారీఖు దాకా సమయం ఉంది. దళితులను పోటీకి పెడితే నేను విత్‌ డ్రా అవుతాను. దళిత నేతలు ఈ విషయంపై జగన్‌ను ఒప్పించండి. లేదంటే వైసీపీ నాయకులు నాకు ఓటేయండి. అంబేద్కర్‌ వాణి పార్లమెంటులో వినపడాలంటే నేనొక్కడినే ఉన్నాను' అని వ్యాఖ్యానించారు.

More Telugu News